Noro Virus : నోరో వైరస్‌పై హెల్త్ డైరెక్టర్ కీలక అప్డేట్

by Bhoopathi Nagaiah |
Noro Virus : నోరో వైరస్‌పై హెల్త్ డైరెక్టర్ కీలక అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో గత కొన్ని రోజులుగా నోరో వైరస్ అనే వ్యాధి విజృంభిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనిపై తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బి.రవీందర్ నాయక్ ఓల్డ్ సిటీ ప్రజలకు కొన్ని సూచనలు జారీ చేశారు. వాంతులు, వికారం, విరేచనాలు వంటి లక్షణాలు ఉన్నవారు హాస్పిటల్ వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ వైరస్ పై వచ్చే వదంతులను ప్రజలు నమ్మవద్దని, భయాందోళనలకు గురికావొద్దని ఆయన కోరారు. Viral Gastroenteritis అని పిలువబడే ఈ వైరస్, అంత ప్రమాదకరమైనది కాదని, ఈ వ్యాధి సోకిన వారు మూడు రోజుల్లో కోలుకుంటారని డాక్టర్ బి.రవీందర్ నాయక్ చెప్పారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా గత వారం రోజులుగా స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.

నోరో వైరస్ అంటే ఏమిటి ... ?

నోరో వైరస్ అని పిలవబడే ఈ వ్యాధి వాంతులు, విరేచనాలకు కారణమయ్యే వైరస్‌ల సమూహం. సాధారణంగా, నోరోవైరస్ వ్యాప్తి చల్లని నెలల్లో సంభవిస్తుంది. ప్రజలు కలుషిత మైన ఆహారం తిన్నప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

ఈ వ్యాధి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

  • చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
  • ఆహారాన్ని సురక్షితమైన స్థలంలో ఉంచాలి. వేడి ఆహారాన్ని తినాలి
  • లక్షణాలు ఉన్న వారితో సన్నిహితంగా మెలగొద్దు
  • కౌంటర్లు, కుళాయిలు, టేబుల్ స్పూన్లు వంటి వాటిని ఎల్లప్పుడూ శుభ్రం చేయాలి.
Advertisement

Next Story

Most Viewed