‘పాలిటిక్స్‌ను కలుషితం చేసిన ఘనత ఆయనదే’

by Sathputhe Rajesh |
‘పాలిటిక్స్‌ను కలుషితం చేసిన ఘనత ఆయనదే’
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ రాజకీయాలను కలుషితం చేశాడని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ విమర్శించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయాలను విష తుల్యం చేశాడని మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయనగాంధీ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, రోహిత్ చౌదరీ, నిరంజన్, మల్రెడ్డి రంగారెడ్డి, సంగిశెట్టి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ..

9 ఏళ్ళు పూర్తి చేసుకొని 10 వ ఏట అడు గుపెడుతున్న తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా, స్వరాష్ట్రంగా ఏర్పడి నేటికి పదేళ్లు అయ్యిందన్నారు. ఈ భౌగోళిక తెలంగాణ ఏర్పాటు కోసం ఆరు దశాబ్దాలుగా ఎంతో మంది ప్రాణాలు దార పోశారని గుర్తు చేశారు. ఉద్యమకారులు వారి జీవితాలను త్యాగం చేశారన్నారు. ఆ త్యాగాలను స్మరించుకుంటు.. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారికి జోహార్లు చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు. అయితే ఈ రాష్ట్రం ఏర్పాట్లు ఎన్నో సవాళ్లు కష్టాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు.

60 ఏళ్ల పాటు రగిలిన ఉద్యమ అగ్నిగోళం గా మరగా,1200 మంది ప్రాణ త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా చేసిన అతి గొప్ప త్యాగమని, సాహసం చేసి ప్రత్యేక స్టేట్‌ను ఇచ్చింది అన్నారు. తెలంగాణ ఉన్నంత కాలం రాష్ట్ర ఏర్పాటు‌లో కాంగ్రెస్ పాత్రను, తల్లి సోనియమ్మ త్యాగాన్ని.. ఆమె చొరవను ఎవ్వరు కాదనలేరని గుర్తు చేశారు. కానీ తెచ్చుకున్న తెలంగాణ‌లో పదేళ్లుగా జరుగుతున్నదేమిటి? అనేది ప్రజలు ఆలోచించాలని సూచించారు. తెలంగాణ భౌగోళికంగా వచ్చిందని కానీ అమరుల, ఉద్యమ కారులు కోరుకున్న తెలంగాణ సాదించుకున్నమా? అని మనం బేరీజు వేసుకోవాలన్నారు.

రాష్ట్రం రాగానే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తా అని కేసీఆర్ మాట తప్పారన్నారు. 2014 ఎన్నికలో దళితులకు కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తా అని, పేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, గిరిజనులకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, కోటి ఎకరాలకు సాగు నీరు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, మండలంలో వంద పడకల ఆసుపత్రి ఇలా అనేక వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసి, భ్రమలకు గురి చేసి తొలి సారి ఎన్నికల్లో 63 సీట్లతో గెలిచారన్నా రు. ఈ దశాబ్దపు కాలంలోతెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ అయిన నెరవేరిందా? అని ప్రజలు ఆలోంచించాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద రాష్ట్రంలో రాజకీయంగా భూ స్థాపితం అవుతుందని తెలిసినా ప్రజల ఆకాంక్షల కొరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చామన్నారు. కేసీఆర్ ఈ పదేళ్ళలో దళితులకు భూములు ఇవ్వకపోగా, ఇందిరమ్మ ఇచ్చిన భూములను గుంజుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రూ.లక్ష రుణ మాఫీ, నిరుద్యోగ భృతి ఉద్యోగాల హామీలు గాలికి వదిలేశారని విమర్శించారు.

ఈ ప్రభుత్వంలోఅవినీతి కి అడ్డు అదుపు లేదన్నారు.లక్షల కోట్ల రూపాయల అక్రమ సంపాదన వెనక వేసుకున్నారని మండిపడ్డారు.

ఆ డబ్బుతో కాంగ్రెస్ పార్టీ ని నిర్వీర్యం చేసే కుట్ర చేశారన్నారు.

తెలంగాణ ఇస్తే బాగుపడ్డ కేసీఆర్ తిన్నంటి వాసాలు లెక్కపెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ నే లేకుండా చేసే కుట్ర కు పాల్పడ్డట్లు ఆరోపించారు.

బీజేపీ తో కలిసి కాంగ్రెస్ పై విషం చిమ్మిదన్నారు

బీజేపీ, బిఆర్ఎస్ రెండు వేరు కాదని, అది కవిత లిక్కర్ కేసులో తేట తెల్లం అయ్యిందన్నారు.

ఇప్పుడు దశాబ్దం అయ్యిందని, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చి.పదేళ్లు అవుతున్న మన బతుకులు మారలేదన్నారు. దొరల ఘడీలు మళ్ళీ కొత్త రంగులు వేస్కుంటున్నాయని పేర్కోన్నారు.రాబోయే నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, ఓటు తో కేసీఆర్ ను గద్దె దిఆపాలని చెప్పారు.కాంగ్రెస్ అధికారం లో వస్తే 2 లక్షల రుణ మాఫీ ,గిట్టుబాటు ధరలకు పంటలు కొంటాంమన్నరు. 2 లక్ష ఉద్యోగాలు,.. 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed