డ్యూటీలకు రారు.. జీతాలు మాత్రం తీసుకుంటారు

by Javid Pasha |
డ్యూటీలకు రారు.. జీతాలు మాత్రం తీసుకుంటారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: “డ్యూటీలకు హాజరు కాకపోయినా.. కొందరు స్టాఫ్ ​జీతాలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ​రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్​ఇనిస్టిట్యూట్ పీవీటీజీ జూనియర్​కాలేజీ హయత్ నగర్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. ఇతర కాలేజీల నుంచి ఈ కాలేజీ ఆఫ్​ఎక్స్​లెన్స్​కి డిప్యూటేషన్​కు వచ్చి.. విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. ఓ డీపీవో కళాశాలకు రాకపోయినా అటెండెన్స్​లో వచ్చినట్లు చూపించి జీతాలు క్లైమ్​చేశారని మాసాబ్ ట్యాంక్​లోని ట్రైబల్ వెల్ఫేర్ ​ముఖ్య కార్యాలయానికి కంప్లైంట్ చేరింది. సుమారు మూడు నెలల సాలరీ లిప్ట్​ చేసినట్లు అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో కంగుతిన్న ఆఫీసర్లు.. ఎంక్వైరీ వేయాలని భావిస్తున్నారు.’’

రాష్ట్ర వ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్​ రెసిడెన్సియల్​ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ పరిధిలో కాలేజీ ఆఫ్​ ఎక్స్​లెన్స్​లు సెంటర్లు మూడు ఉన్నాయి. ఆసీఫాబాద్ లో ఒకటి, రెండు హయత్ నగర్ పరిధిలో నిర్వర్తిస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్​ పరిధిలోని జూనియర్​ కాలేజీల్లో కొంత మంది టీచింగ్, నాన్​టీచింగ్ స్టాఫ్​లు డిప్యుటేషన్ ​విధానంలో ఈ ఎక్స్​లెన్స్​ కేంద్రాల్లో పని చేస్తున్నారు. వీరిలో కొందరు కాలేజీలకు రాకపోయినా.. అటెండెన్స్​చూపించి జీతాలు క్లైమ్​చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఔట్ సోర్సింగ్ విధానంలో వచ్చిన కొందరు స్టాఫ్ ​జీతాలు తీసుకున్నట్లు ఇప్పుడు మాసాబ్ ట్యాంక్ కార్యాలయంలో చర్చ జరుగుతున్నది. కొందరు ప్రిన్సిపాళ్లు, ఆర్​సీ ల చొరవతోనే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు అనుమానం ఉన్నది. దీంతో కాలేజీల ఆఫ్​ఎక్స్​లెన్స్​సెంటర్లతో పాటు ట్రైబల్ వెల్ఫేర్​పరిధిలోని అన్ని కాలేజీలలో ఎంక్వైరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed