Harish Rao: వీటిపై ఎందుకు స్పందించరు.. బీఆర్ఎస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Goud |
Harish Rao: వీటిపై ఎందుకు స్పందించరు.. బీఆర్ఎస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరని, ప్రభుత్వం గురుకులాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నది అనడానికి ఇదే నిదర్శనమని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి పాలమాకుల గురుకుల పాఠశాలను హరీష్ రావు సందర్శించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్ధులతో సంభాషించిన వీడియోలను పోస్ట్ చేశారు. దీనిపై ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరని, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. అంతేగాక దీనిపై ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేకపోవడం సిగ్గుచేటని అన్నారు.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. అన్నంలో, పప్పులో పురుగులు ఉన్నాయ్ అంటే తినండి అంటున్నారని, ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారని, రెండో జత ఇవ్వలేదు.. పుస్తకాలు కూడా ఇవ్వలేదని, తమ దీన స్థితిని వ్యక్తం చేస్తూ విద్యార్థులు కన్నీటి పర్యంతమైనట్లు తెలిపారు. గురుకులాల్లో కేసీఆర్ సన్న బియ్యంతో అన్నం పెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం గొడ్డుకారంతో పెడుతుందని ఆరోపించారు. గురుకులాలను గాలికి వదిలేశారని, విద్యా శాఖను పట్టించుకోవడం లేదని, ఎవరు ఏం అడిగిన పట్టించుకునే వారు లేరని హరీష్ రావు ఎక్స్ లో రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed