- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Harish Rao: ఆ ఘనత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీలదే.. మాజీ మంత్రి ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకు అవకాశాలు గణనీయంగా పెరిగాయని, వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. వైద్య విద్యలో కన్వీనర్ కోటా సీట్లపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మూడు లక్షల పైగా ర్యాంకులు వచ్చిన తెలంగాణా విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు రావడం సంతోషించదగ్గ విషయమని ఆనందం వ్యక్తం చేశారు. బీసీ-ఏ కేటగిరిలో 3.35 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి, ఎస్సీ కేటగిరీలో 3.11 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి, ఎస్టీ కేటగిరీలో 2.89 లక్షల ర్యాంకు, బీసీ-బి లో 2.27 లక్షలు, బీసీ-సీ లో 3.14 లక్షలు, బీసీ-డి లో 2.13 లక్షలు, బీసీ-ఈ లో 2.24 లక్షల గరిష్ట ర్యాంకులు సాధించిన వారికి ఎంబీబీఎస్ సీట్లు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు.
మారుమూల ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయడం, తెలంగాణ బిడ్డలు డాక్టర్ కావాలనే కలను స్వరాష్ట్రంలోనే వుండి సుసాధ్యం చేసుకోవాలని, కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజి ఏర్పాటు చేశారని అన్నారు. కేసీఆర్ పాలనలో గడిచిన పదేళ్ల కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 5 నుండి 34 కు పెరిగాయని, ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 20 నుండి 60 కి చేరాయని తెలిపారు. వైద్య విద్యకు తెలంగాణను కేరాఫ్ అడ్రస్ గా చేసిన ఘనత కేసీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2850 నుండి 8315 లకు పెరిగి, ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకు అవకాశాలు గణనీయంగా పెరిగాయని అన్నారు. ఇక వైద్య విద్య కోసం చైనా, ఉక్రెయిన్, రష్యా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందని, రాష్ట్రంలో పెరిగిన మెడికల్ సీట్లను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని, తెలంగాణాలో ఉంటూ వైద్య విద్య చదివి దేశానికి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నానని ఎక్స్ లో రాసుకొచ్చారు.