‘Eenadu’ రామోజీరావుకు కృతజ్ఞతలు చెప్పిన హరీష్ రావు

by GSrikanth |   ( Updated:2023-08-17 12:11:32.0  )
‘Eenadu’ రామోజీరావుకు కృతజ్ఞతలు చెప్పిన హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఈనాడు’ గ్రూపు అధినేత రామోజీరావుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు చెప్పారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో నూతనంగా నిర్మించిన తహశీల్దార్‌ కార్యాలయాన్ని మంత్రి సబిత ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీష్ రావు అన్నారు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అన్ని అవార్డుల్లో తెలంగాణకే ఎక్కువ దక్కాయన్నారు. రూ.4.5 కోట్లతో తహశీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాలు నిర్మించిన రామోజీ ఫౌండేషన్‌కు హరీష్ రావు థాంక్స్ చెప్పారు. ముఖ్యంగా రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావుకు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు చెప్పారు.

Read More : సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం

Advertisement

Next Story

Most Viewed