11 ఏళ్ల క్రితం నాటి ఫొటో షేర్ చేసిన హరీష్ రావు.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

by Gantepaka Srikanth |
11 ఏళ్ల క్రితం నాటి ఫొటో షేర్ చేసిన హరీష్ రావు.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్‌‌డెస్క్: తెలంగాణ చరిత్ర(Telangana History)లో ఫిబ్రవరి 18కి ప్రత్యేకత ఉన్నది. 2014, ఫిబ్రవరి 18వ తేదీన లోక్‌సభ(Lok Sabha)లో తెలంగాణ బిల్లు(Telangana Bill) ఆమోదించబడింది. ఈ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. బిల్లు ఆమోదించిన తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌తో సంబురాలు చేసుకుంటున్న ఫొటోను హరీష్ రావు(Harish Rao) పోస్టు పెట్టారు. కేసీఆర్‌(KCR) లాంటి దార్శనికత కలిగిన నాయకుడి నాయకత్వంలో ప్రజాఉద్యమం విజయం సాధించిన రోజు అని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రజాఉద్యమాలు విజయం సాధిస్తాయని చాటిన సందర్భమని, పట్టుదల, నిబద్ధత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన రోజు అని పేర్కొన్నారు.

ఆ ఫొటోలో :

మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విఠల్ సహా పలువురు నాయకులు ఉన్నారు.



Next Story