Harish Rao : నీ అయ్యా జాగీరా.. దానంకు హరీష్‌రావు మాస్ వార్నింగ్!

by Ramesh N |
Harish Rao : నీ అయ్యా జాగీరా.. దానంకు హరీష్‌రావు మాస్ వార్నింగ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అసెంబ్లీలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ నగర పరిస్థితిపై సభలో దానం మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన దానం నాగేందర్.. ‘మీరు ఇలాగే ప్రవర్తిస్తే హైదరాబాద్‌లో తిరగనియ్య కొడకల్లారా.. తోలు తీస్తా’ అంటూ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు.. దానంకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

అసెంబ్లీ ముందున్న గన్‌పార్క్ వద్ద హరీష్ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తిరగనీయ అంటే నీ అయ్యా జాగీరా.. నువు ఎవ్వడివి హైదరాబాద్‌లో తిరగనీయ అని చెప్పడానికి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కన్న తల్లుల ఆత్మగౌరవం దెబ్బ తీసే విధంగా మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా? అని ప్రశ్నించారు. ఈ భాషతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినదా? హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తాయా? అని హరీష్ రావు ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed