Harish Rao: కబోదుల్లారా.. ఇప్పటికైనా కన్నులు తెరిచి ఈ దృష్యాన్ని చూడండి

by Ramesh Goud |   ( Updated:2025-01-20 12:01:48.0  )
Harish Rao: కబోదుల్లారా.. ఇప్పటికైనా కన్నులు తెరిచి ఈ దృష్యాన్ని చూడండి
X

దిశ, వెబ్ డెస్క్: కబోదుల్లారా.. కన్నులు తెరిచి ఇప్పటికైనా కాళేశ్వరాన్ని(Kaleshwaram) చూడండి అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్(Ranganayaka Sagar) నిండు కుండలా మారిందని చెబుతూ.. దీనికి సంబంధించిన దృష్యాలను బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. వందలాది కిలోమీటర్లు ప్రయాణించి, రంగనాయక సాగర్ కు చేరిన గోదావరి గంగ అని, ఇది కాళేశ్వరం సృష్టించిన అపురూప దృశ్యం.. అద్భుత జల సౌందర్యం.. అని కీర్తించారు. అలాగే కాళేశ్వరాన్ని బదనాం చేస్తున్న కబోదుల్లారా.. కన్నులు తెరిచి ఈ సుందర దృశ్యం చూడండి అని, కాళేశ్వరం తెలంగాణకు ప్రాణధార అనే సత్యాన్ని చెరిపేయలేమని గుర్తించండి అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

Next Story