- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Harish Rao: వికారమైన భాషతో విపక్షాల మీద ఎగురుడు కాదు.. సీఎంపై హరీష్ రావు హాట్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణ (Krishna), గోదావరి (Godavari) జలాలను పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (Andhra PradesH) తరలించుకుపోతున్నా.. తెలంగాణ సర్కార్ (Telangana Government) మొద్దు నిద్ర పోతోందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే వేసవిలో తెలంగాణ (Telangana)కు 123 టీఎంసీలు, ఆంధ్రా (Andhra)కు 9 టీఎంసీల నీరు విడుదల చేయాల్సి ఉందని అన్నారు. మొత్తం 132 టీఎంసీల నీరు కావాల్సి ఉండగా.. నేటికీ శ్రీశైలం (Srisailam), నాగార్జున సాగర్ (Nagarjuna Sagar)లో ఉన్న నీరు కేవలం 100 టీఎంసీలు మాత్రమేనని తెలిపారు. అయితే, మిగతా నీళ్లను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. కళ్లెదుటే ఏపీ నీళ్లును ఏపీ తరలించుకుపోతున్నా.. బెల్లంకొట్టిన రాయిలా ప్రభుత్వం ఉందని కామెంట్ చేశారు.
నాగార్జున సాగర్ (Nagarjuna Sagar)ను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. మాట్లాడితే వికారమైన భాషతో విపక్షాల మీద ఎగిరిపడటం కాదని.. ఏపీ ప్రభుత్వం, కేంద్రం మీద ఎగిరిపడాలని సీఎం రేవంత్‌కు హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) హయాంలో రాష్ట్రానికి నీళ్లను మళ్లించామని గుర్తు చేశారు. ప్రతి రోజూ 10 వేల క్యూసెక్కుల నీళ్లను ఏపీ తీసుకెళ్తున్నా.. ప్రభుత్వ పెద్దలు నోరు మెదపకపోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. 666 టీఎంసీలకు గానూ ఇప్పటికే ఏపీ 657 టీఎంసీలను వినియోగించుకుందని.. కానీ, తెలంగాణకు 343 టీఎంసీలకు గానూ 220 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవడం ప్రభుత్వ అసమర్ధతేనని మండిపడ్డారు. ఇప్పటికైనా సర్కార్ కల్లు తెరిచి రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ నీటి విడుదలను వెంటనే బంద్ చేయించాలని డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వంతో కలిసి కేఆర్ఎంబీ (KRMB) కార్యాలయం ఎదుట ధర్నాకు బీఆర్ఎస్ సిద్ధమని హరీశ్ రావు అన్నారు.