- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Harish Rao: లా అండ్ ఆర్డర్ అదుపుతప్పినా చీమ కుట్టినట్టు లేదు: హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని మాజీ మంత్రి హరీష్‌రావు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. శాంతిభద్రతల విషయంలో పూర్తి విఫలయం అయ్యారని మండిపడ్డారు. ఎనమిది నెలల్లో 500 హత్యలు జరిగాయంటూ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మరునాడే హైదరాబాద్‌లో మరో రెండు హత్యలు జరగడం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది అన్నారు. హోం శాఖను తన వద్దే పెట్టుకుని రాష్ట్రంలో నేరాలు జరగుతుంటే సీఎం కనీసం సమీక్ష నిర్వహించలేదని ధ్వజమెత్తారు. ప్రజల మాన, ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాల్లో లా అండ్ ఆర్డర్ లేకపోవడం బాధాకరం అని అన్నారు.
శాంతి భద్రతల నిర్వహణలో సీఎం, పోలీసులు పూర్తిగా విఫలయ్యారని చెప్పడానికి రోజురోజుకూ పెరుగుతున్న నేరాలే నిదర్శం అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర మేల్కొని వెంటనే శాంతిభద్రతలను పునరుద్ధరించాలని కోరారు. గత పదేళ్లలో హైదరాబాద్ సహా తెలంగాణ నెలకొల్పిన శాంతి భద్రతల కారణంగా వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ప్రతిరోజు ఇలాంటి పరిస్థితులు చూస్తే రాష్ట్ర ప్రతిష్టతో పాటు హైదరాబాద్ ప్రతిష్ట కూడా దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఫలితంగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంఘ విద్రోహశక్తులపై ఉక్కుపాదం మోపాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఏమాత్రం సరికాదన్నారు. సీఎం రాజకీయాలకు అతీతంగా స్పందించి, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడంపై దృష్టి సారించాలని కోరారు.