Harish Rao: గాలిలో దీపంలా తెలంగాణ రైతుల పరిస్థితి

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-03 10:15:52.0  )
Harish Rao: గాలిలో దీపంలా తెలంగాణ రైతుల పరిస్థితి
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) విమర్శలు చేశారు. ఆదివారం సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వా(Congress Government)నికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని అన్నారు. రైతులను ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటివరకు రైతుబంధు(Rythu Bandh) డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెండు పంటలు పండాయని.. కానీ ఒక్క పంటకు కూడా ఇప్పటివరకు రైతుబంధు(Rythu Bandh) మాత్రం ఇవ్వలేదని అన్నారు.

అకాల వర్షానికి చాలా చోట్ల వడ్లు తడిసిపోయాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కొబ్బరి కాయలు కొట్టి హడావిడిగా కొనుగోలు కేంద్రాలు(Buying Centers) ప్రారంభిస్తున్నారు కానీ, వడ్లు మాత్రం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి గాలిలో పెట్టిన దీపంలా మారిందని ఆవేదన చెందారు. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ రైతుల(Soybean Farmers)కు ఇంకా డబ్బులు చెల్లించలేదని గుర్తుచేశారు. సిద్దిపేట జిల్లాలోనే 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే 800 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారని విమర్శించారు. పదవిని ఎంజాయ్ చేస్తూ హైదరాబాద్‌లో కూర్చోవడం కాదు.. క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసుకోండి అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed