రేవంత్ రెడ్డి ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నావ్? ఆ పని చేయకుంటే రాజీనామాకు సిద్ధమా?

by Prasad Jukanti |
రేవంత్ రెడ్డి ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నావ్? ఆ పని చేయకుంటే రాజీనామాకు సిద్ధమా?
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ హామీలే ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తం అవుతుందని సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానంటున్న రేవంత్ రెడ్డి ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నావ్ అని ప్రశ్నించారు. పంద్రాగస్టు లోపు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు. సోమవారం సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ అంటేనే కరువు కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు అని ఎద్దేవా చేశారు. రైతు బంధు పూర్తిగా ఇంకా ఎందుకు ఇవ్వలేదో రేవంత్ చెప్పాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఎందుకు ఓడించాలో చెప్పాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ కాంగ్రెస్ ను ఓడించేందుకు 100 కారణాలు ఉన్నాయన్నారు. రైతు రుణమాఫీ, ధాన్యానికి బోనస్, రైతు భరోసా, మహిళలకు రూ.2500, కల్యాణ లక్ష్మికి తులం బంగారం, ఆసరా పెన్షన్లు, నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు కాంగ్రెస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. నాలుగున్నర నెలలో ఏదో చేసినట్లుగా తమకు ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని రేవంత్ రెడ్డి ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడి బీఆర్ఎస్ గెలిస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు.

Advertisement

Next Story