- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Harish chit chat: కాంగ్రెస్‌లో సీనియర్లకు ప్రాధాన్యత లేదు.. అసెంబ్లీ లాబీలో హరీష్ చిట్‌చాట్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభా సమావేశాల్లో తొలి రోజున సభ దద్దరిల్లింది. ఆర్టీసీ కార్మికులపై ప్రారంభమైన చర్చ మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో యూనియన్లను నిర్వీరం చేశారని పొన్నం కౌంటర్ ఇస్తే.. అసలు ఆర్టీసీని ఎప్పుడు ప్రభుత్వంలో విలీనం చేస్తారో చెప్పాలని హరీష్ ప్రశ్నించారు. సభలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వట్లేదని స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను ఆక్షేపించగా.. సీఎం రేవంత్‌రెడ్డి కలుగజేసుకుని అందరికి అవకాశం ఇవ్వాలని బదులిచ్చారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలపై జీరో అవర్‌లో చర్చ చేపట్టాలంటూ బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో సభ కాసేపు వాయిదా పడింది. ఈ క్రమంలో అసెంబ్లీ లాబీలోకి వచ్చిన హరీష్‌రావు మీడియాతో చిట్‌చాట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేదంటూ కామెంట్ చేశారు. మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని, పార్టీలోనే ఉంటున్న వీహెచ్ లాంటి మోస్ట్ సీనియర్లకు ఎలాంటి పదవి దక్కలేదని అన్నారు. స్వార్థం కోసం కండువాలు మార్చే నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన కేకేకు కేబినెట్ హాదాతో పదవి ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మరో సీనియర్ నేత కోదండరెడ్డిని కూడా పక్కన పెట్టారని హరీష్ రావు ఆరోపించారు.