- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Handloom: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేనేత కార్మికుల పాలాభిషేకం

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ హన్మకొండ జిల్లా(Hanumakonda District)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేనేత కార్మికులు పాలాభిషేకం చేశారు. చేనేత కార్మికుల(Handloom workers) సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత అభయహస్తం పథకం ద్వారా రూ.168 కోట్లు కేటాయించడం పట్ల చేనేత కమలాపూర్(Kamalapur) కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చేనేత కార్మికులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవ వల్ల ఎంతో మంది చేనేత కార్మికులకు మేలు జరుగుతుందని అన్నారు. చేనేత కార్మికుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) మూడు పథకాలను అమలు చేయడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు(Thank You) తెలియజేశారు.