- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana: ప్రభుత్వ స్కూళ్లకు ఒంటిపూట బడి
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల అభ్యున్నతికి వివిధ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధితోపాటు రాజకీయ అవకాశాలను మెరుగుపర్చడానికి తగిన ప్రణాళికలు చేసేందుకు వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే(Family survey) చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చేపట్టాలని అసెంబ్లీ ఈ ఏడాది ఫిబ్రవరి 4న తీర్మానం చేసింది. ఈ సర్వే చేసేందుకు ప్రణాళిక శాఖ నోడల్ విభాగంగా వ్యవహరించనున్నది. సర్వేలో సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వం ఆయా అంశాల్లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగించుకుంటుంది. అన్నివర్గాల అభ్యున్నతికి ఈ సర్వే ఉపకరిస్తుందని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. సర్వేలో సేకరించనున్న వివరాలతోపాటు సర్వేకు అధికారులు సిద్ధమైన తీరుపై ప్రత్యేక కథనం. = నిసార్
ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ వైడ్‌గా ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభించింది. రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్‌మెంటు ఆధ్వర్యంలో జరిగే ఈ సర్వేలో దాదాపు 90 వేల మంది ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. వీరందరూ ఇల్లుల్లు తిరుగుతూ కుటుంబాలను పలు పశ్నలు అడిగి నోట్ చేసుకోకున్నారు. అన్ని వివరాలతో ఈ సర్వే ప్రక్రియను ఈ నెల 30వ తేదీకల్లా పూర్తి చేసేలా ప్రభుత్వం షెడ్యూల్ రూపొందించింది. తప్పులు లేకుండా వివరాలు నమోదు చేసేలా ఇప్పటికే సిబ్బందికి పలు దఫాలుగా ఆఫీసర్లు శిక్షణ ఇచ్చారు.
సామాజిక, ఆర్థిక వివరాలు సేకరణ
కుటుంబ సర్వేలో మొత్తం 56 ప్రశ్నాలు ఉండగా.. ఉప ప్రశ్నలతో కలుపుకుని మొత్తం 75 ప్రశ్నాలు ఉంటాయి. పార్ట్ 1లో కుటుంబ యజమాని, సభ్యుల విద్య, ఉద్యోగ, భూమి తదితర వ్యక్తిగత వివరాలు ఉంటాయి. పార్ట్ 2లో కుటుంబానికి ఉన్న రుణాలు, స్థిరాస్తి, రేషన్ కార్డు, విద్యుత్ తదితర వివరాలు ఉంటాయి. ఇలా ప్రజల కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ వివరాలన్నింటినీ ప్రభుత్వం సేకరించనున్నది. కుటుంబంలోని అందరి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్లు వంటి వ్యక్తి గత వివరాలన్నీ సేకరించనున్నది. అయితే ఈ వివరాలు సంక్షేమ పథకాలకు ఎలా వర్తింపజేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని కుటుంబాల డేటా ప్రభుత్వం దగ్గర రెడీగా ఉండడానికి ఈ సర్వే దోహదపడనున్నదని ఆఫీసర్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఒకే రోజున సమగ్ర కుటుంబ సర్వే జరిగినా ఆ వివరాలేవీ ఇప్పటికీ బహిర్గతం కాలేదు. కానీ ఇప్పుడు చేపడుతున్న సర్వేతో మొత్తం డేటా సేకరిస్తున్నందున భవిష్యత్తులో అవసరాలకు రెడీమేడ్ సమాచారంగా ప్రభుత్వానికి ఉపయోగపడనున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడం, మధ్యలోనే ఆపివేయడం మొదలు ఇప్పటివరకూ సంక్షేమ పథకాల అమలు ద్వారా పొందుతున్న లబ్ది వరకు అనేక అంశాలు పశ్నలు ఈ సర్వేలో అడిగి నమోదు చేయనున్నారు.
స్థిరాస్తులు, చరాస్తుల వివరాలు సైతం
సర్వేలో కుటుంబాల నుంచి ప్రభుత్వం స్థిర, చరాస్తుల వివరాలు సైతం అడిగి తెలుసుకోనున్నది. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా?.. మీ వార్షిక ఆదాదాయం ఎంత?.. అందులో స్థిరాస్తుల వివరాలేంటి?.. చరాస్తుల్లో ఉన్నవేంటి?.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా?.. వార్షిక టర్నోవర్ ఎంత?.. కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నట్లయితే ఆ భూమి విస్తీర్ణమెంత?.. రిజర్వేషన్‌తో విద్యాపరంగా, ఉద్యోగపరంగా లబ్ధి పొందారా?.. ఐదేండ్లలో ప్రభుత్వం నుంచి ఎన్ని రూపాల్లో లబ్ధి పొందారు?.. ఏవైనా నామినేటెడ్ పోస్టుల్లో కొనసాగారా?... ప్రజాప్రతినిధిగా ఎన్ని టర్ములు పని చేశారు ? బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారా?. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కనిపించే ప్రశ్నలు. ప్రతి గ్రామం, పట్టణం, వార్డు, డివిజన్‌లలో ఈ సర్వేను నిర్వహిస్తున్నందున పకడ్బందీగా జరిగేందుకు సూపర్‌వైజర్లను సైతం ప్రభుత్వం నియమించింది. జిల్లా కలెక్టర్లు ప్రతి రోజూ గ్రామాలు, పట్టణాలను సందర్శించడంతో పాటు సూపర్‌వైజర్లతో రివ్యూ చేయనున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల మొదలు వివిధ రూపాల్లో ఆర్థిక సాయం, సబ్సిడీలు అందుకోడానికి ఉండే అర్హతలు సైతం ఈ గణాంకాల ద్వారా తేలనున్నాయి. కుటుంబ యజమానితో సహా సభ్యులందరి వ్యక్తిగత వివరాలు, ఆస్తులు తదితరాలు కూడా దీని ద్వారా తేలనున్నాయి.
ఇంటింటి సర్వేలో 80వేల మంది సిబ్బంది
ఈ నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటింటి సమగ్ర సర్వే మూడు వారాలా పాటు జరగనున్నది. ఇందులో మొత్తం 80 వేల మంది సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో ప్రధానంగా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లు, హెడ్మాస్టర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో మొత్తం 36,559 మంది ఎస్‌జీటీలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లు పాల్గొననున్నారు. దీంతో పాటు 6,256 మంది ఎంఆర్‌సీ సిబ్బంది, 2000 మంది సర్కారు, జెడ్పీ/ఎంపీపీ స్కూళ్లలోని సిబ్బంది, ఎయిడెడ్ స్కూళ్లలోని మినిస్టీరియల్ సిబ్బందిని వినియోగించుకుంటామని అధికారులు ప్రకటించారు. వీరితో పాటు అంతే కాకుండా తహశీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్ల సేవలను వినియోగించుకోనున్నట్టు తెలిపారు.
కలెక్టర్ల పాత్ర
సర్వేలో కలెక్టర్లు కీలకపాత్ర పోషించనున్నారు. ఇప్పటికే యుద్ధప్రాతిపదికన సర్వేకు సంబంధించిన అన్ని పనులు పూర్తిచేయగా.. అవసరమైన సామాగ్రి కూడా కలెక్టరేట్లలో సిద్ధం చేశారు. సర్వే చేసే ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్ల గుర్తించగా.. వారికి నేడు ఎన్యూమరేటర్ బ్లాక్ (ఈబీ)ను నిర్దేశించడంతోపాటు షెడ్యూల్, స్టిక్కర్లు, ఇళ్ల జాబితా అందజేస్తారు. ప్రతి ఈబీకి ఒక ఎన్యూమరేటర్, 10మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్ ఉండనున్నారు.
సర్వే ఇలా..
- ప్రతి జిల్లా నుంచి ఐదుగురు, జీహెచ్ఎంసీ నుంచి 10మంది ట్రైనర్స్ ఆఫ్ ట్రైనర్స్ గా ఎంపిక చేయగా.. వారంతా సూపర్ వైజర్, ఎన్యూమరేటర్లకు దశలవారీగా శిక్షణ ఇచ్చారు.
- ఎన్యూమరేటర్లకు రాసేందుకు వీలుగా ఒక ప్యాడ్, పెన్సిల్, బ్లూ బాల్ పాయింట్ పెన్ను, సీడీ మార్కర్, ఎరేజర్, పెన్సిల్ షార్ప్ నర్, క్యారీయింగ్ ఫోల్డ్ మెటీరియల్ అందజేయనున్నారు.
- సేకరించే సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని ఎన్యూమరేటర్ కుటుంబ యజమానులకు భరోసా ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాలకూ అందేలా చేసేందుకే సర్వే చేపడుతున్నట్టు వారికి నచ్చజెప్పాలి.
- ఎన్యూమరేషన్ పూర్తి అయిన తర్వాత వాటిని ఎన్యూమరేటర్లు జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి.
- తమకు కేటాయించిన డేటా కేంద్రానికి వచ్చి డేటా ఎంట్రీ చేయించాలి.
- ఆ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోవద్దు. సమాచారం లీక్ అయినట్టు తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
- రోజూవారీ సర్వే పురోగతిని ఏరోజుకు ఆరోజు సాయంత్రం ఆరుగంటలకు ప్రణాళిక శాఖకు పంపాల్సి ఉంటుంది.
- ఈ సర్వేలో కుటుంబంలో ఎవరైనా ప్రజాప్రతినిధులు ఉన్నారా? అని కూడా ప్రశ్నించనున్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్ని టర్ములు పనిచేశారు. ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారన్న వివరాలు కూడా సేకరించనున్నారు. బహుశ ఈ తరహా వివరాలు సేకరించడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి కావచ్చు.
స్కూళ్లు ఒంటిగంట మాత్రమే..
ఈ నెల 6వ తేదీ నుంచి జరగనున్న సర్వే ఎక్కువ శాతం ప్రభుత్వ స్కూళ్లకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే స్కూళ్లు నడవనున్నాయి. ఆ తర్వాత వీరందరూ సర్వే డ్యూటీలో పాల్గొననున్నారు.
దేశంలోనే తొలి సారిగా : బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
దేశంలోనే తొలగిసారిగా రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీన చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలి. ఇంటికి వచ్చిన సిబ్బందికి పూర్తి వివరాలు అందజేయాలి. ఈ సర్వే రాబోయే రోజుల్లో అన్ని రకాల పథకాలు అందించడానికి, ఇది ఒక మెగా హెల్త్ చెకప్ లాగా భవిష్యత్‌లో ప్రక్రియ పూర్తి చేయడానికి పయోగపడుతుంది. సర్వే కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. ఈ నెల 30వ తేదీలోపు సమాచార సేకరణ పూర్తి చేయాలనే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం.