SLBC Tunnel Accident : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై గుత్తా దిగ్బ్రాంతి

by Y. Venkata Narasimha Reddy |
SLBC Tunnel Accident : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై గుత్తా దిగ్బ్రాంతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident)పై తెలంగాణ శాసన మండలి చైర్మన్(Legislative Council Chairman) గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. సకాలంలో స్పందించి, సహాయక చర్యలు అందించిన మంత్రులను, అధికారులను ఆయన అభినందించారు. ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ స్కీంలో భాగంగా శ్రీశైలం నుంచి దేవరకొండ వైపు వెళ్లే టన్నెల్ 14 కిలోమీటర్ ఇన్లేట్ వద్ద (దోమలపెంట దగ్గర) సి పేజ్ ను పూడ్చివేసిన కాంక్రీట్ సెగ్మెంట్ స్లిప్ అవడంవల్ల ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపినట్లు ఆయన చెప్పారు.

కాగా ప్రమాదం తీవ్రత తెలుసుకుని సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు ఇప్పటికే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి హుటాహుటిన హెలిక్యాప్టర్ పై సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం సమయంలో 50మంది వరకు కార్మికులు సొరంగంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వారందరిని సురక్షితంగా బయటకు తీసకువవచ్చారు. అయితే ఇద్ధరు ఇంజనీర్లు, టెక్నికల్ సిబ్బంది సహా మరో 8మంది టన్నెల్ లో చిక్కుకున్నారు. దీంతో వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్, ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

అందుతున్న సమాచారం మేరకు 150మీటర్ల వరకూ టన్నెల్ కూలిపోయింది. ప్రమాద తీవ్రతతో వేయి క్యూబిక్ మీటర్ల ఎత్తున మట్టి, రాళ్లు కుప్పగా సొరంగంలో కుప్పగా పడ్డాయి. 42మంది కార్మికులను సురక్షితంగా బయటపడ్డారు. 8మంది కార్మికులు ప్రస్తుతం టన్నెల్లో చిక్కుకున్నట్టు నిర్ధారణ చేశారు. లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేదుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Next Story