మదర్ డెయిరీ చైర్మన్ గా గుడిపాటి మధుసూదన్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |
మదర్ డెయిరీ చైర్మన్ గా గుడిపాటి మధుసూదన్ రెడ్డి
X

దిశ వెబ్ డెస్క్ : ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం(నార్మూల్) మదర్ డెయిరీ చైర్మన్ గా గుడిపాటి మధుసూదన్ రెడ్డిని డైరక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గుడిపాటి మధుసూదన్ రెడ్డిది ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం వేలుపల్లి గ్రామం. మదర్ డెయిరీ నూతన చైర్మన్ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్, డైరక్టర్లను వారు అభినందించారు. అనంతరం మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మదర్ డెయిరీని లాభాల బాటలో తీసుకురావాలని, పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని చైర్మన్, డైరెక్టర్లకు సూచించారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతు రుణమాఫీని విజయవంతంగా అమలు చేసి, ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. పాడి రైతుల సంక్షేమానికి సైతం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్లు కల్లెపల్లి శ్రీశైలం,గుడిపాటి మధుసూదన్ రెడ్డి, పుష్పాల నర్సింహులు, బత్తుల నరేందర్ రెడ్డి, రుద్రాల నరసింహ రెడ్డి, మండలి జంగయ్యలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed