గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పిటిషన్ మరో బెంచ్‌కు బదిలీ

by Mahesh |   ( Updated:2023-05-25 07:46:52.0  )
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పిటిషన్ మరో బెంచ్‌కు బదిలీ
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వెయ్యాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ మరో బెంచ్‌కు బదిలీ చేసారు. తన కూతురు కూడా గ్రూప్ 1 పరీక్ష రాస్తున్న నేపథ్యంలో ఈ పిటిషన్ పై తాను విచారణ చెయ్యలేనని ఆయన పేర్కొన్నారు. ఇటీవల 36 మంది అభ్యర్థులు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రెండు నెలలపాటు వాయిదా వేయాలని అభ్యర్థిస్తూ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story