రెండో రోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్

by M.Rajitha |
రెండో రోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్
X

దిశ, వెబ్ డెస్క్ : టీజీపీఎస్సీ(TGPSC) గ్రూప్ 1 మెయిన్స్(Group 1 Mains) ఎగ్జామ్స్ లో భాగంగా రెండవ రోజు పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. రెండవ రోజు జనరల్ ఎస్సే పరీక్ష నిర్వహించారు. కాగా మొత్తం 31 వేలకు మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించగా.. కేవలం 21,817 మంది అభ్యర్థులు మాత్రమే నేటి పరీక్షకు హాజరయ్యారు. కేవలం 69.4 శాతం మంది మాత్రమే హాజరవడంపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు దృష్టి సారించారు. గత ప్రభుత్వ హయాంలో ఏకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీక్ కావడం రాష్ట్రంలో దుమారం రేకెత్తింది. మరోసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించినప్పటికీ.. పబ్లిక్ కమిషన్ కొన్ని నిబంధనలు పాటించలేదని హైకోర్ట్ ఆ పరీక్షను కూడా రద్దు చేసింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యనే అన్ని పార్టీలకు ప్రధాన అస్త్రం కాగా.. ఉద్యోగాల భర్తీలో అలసత్వం వహించినందుకు గానూ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని పొందింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి వివాదాలకు తావులేకుండా మరోమారు ప్రిలిమ్స్ నిర్వహించి, ప్రస్తుతం మెయిన్స్ పరీక్షలు జరుపుతోంది. ఎక్కడా ఎలాంటి అవకతవకలు జగరకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించడంతో.. అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈనెల 21 నుండి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతుండగా.. నేడు రెండవ పరీక్ష జరిగింది.

Advertisement

Next Story

Most Viewed