Milad-Un-Nabi 2024 : ప్రజాపాలనలో ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ సందేశం

by Ramesh N |
Milad-Un-Nabi 2024 : ప్రజాపాలనలో ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ సందేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇస్లామియా కాలమాన పట్టిక ప్రకారం మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలు మిలాద్-ఉన్-నబీ పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. ఈ నెల ప్రారంభం నుంచి 12 రోజుల పాటు ప్రవక్త జీవిత విశేషాలు తెలియజేస్తూ మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. కాగా, మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఆయన తెలంగాణ సీఎంవో కార్యాలయం ద్వారా ఓ సందేశం విడుదల చేశారు. ప్రపంచానికి శాంతి, కరుణ, ఐక్యత సందేశం ఇచ్చిన ముహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం అత్యంత పవిత్రమైన రోజని అన్నారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రజా పాలనలో సముచిత ప్రాధాన్యం ఉంటుందని తన సందేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed