- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరమ్మ ఇళ్ళకు ఇంజినీర్లు కరువు.. పాత సమస్యకు కొత్త సొల్యూషన్‌తో చెక్ పెట్టనున్న సర్కార్
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ సారథ్యంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టాలని భావిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఇంజినీర్లను ఔట్ సోర్సింగ్ పద్దతిన తీసుకోవాలని హౌసింగ్ శాఖ భావిస్తున్నది. అందుకు రాష్ట్ర సర్కారు కూడా పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్ లో తగిన మేరకు ఇంజినీర్లు లేరని… అందుచేత, తమకు ఇంజినీర్లను కేటాయించాలని హౌసింగ్ శాఖ ప్రభుత్వానికి విన్నవించగా… తాత్కాలిక పద్దతిలో ఇంజినీర్లను నియమించుకోవాలని ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం ఫస్టు ఫేజ్ లో నాలుగున్నర లక్షల ఇండ్లకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో… ఆ పథకాన్ని అమలు పరిచేందుకు తగినంత సంఖ్యలో పర్మినెంట్ స్టాప్ లేరు. దీంతో ఒకేసారి స్కీం అమలను ప్రారంభిస్తే సిబ్బంది కొరత వేధిస్తుందని హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే, ఈ విషయంకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా విధివిధానాలకు అనుమతి లభించినట్టు మాత్రం తెలిసింది. హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు విధివిధానాలు రూపొందించిన తర్వాత ప్రభుత్వ మరొకసారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అనంతరం, తాత్కాలిక పద్ధతిన ఇంజినీర్లను రిక్రూట్ చేసే ప్రక్రియ ముందుకు వెళ్ళనుంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్లు కట్టించేందుకు అవసరమైన ప్రక్రియలో భాగంగా… తెలంగాణ ప్రభుత్వం గ్రామానికో ఇందిరమ్మ కమిటీ నియమించాలని నిర్ణయం తీసుకున్న విషయం తీసుకున్నది. గ్రామం, మున్సిపాలిటీల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు సైతం ఇదివరకే జారీ చేసింది. గ్రామ కమిటీలో గ్రామ సర్పంచ్ ఛైర్మన్‌గా ఏడుగురు సభ్యులు ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. కమిటీ కన్వీనర్‌గా పంచాయతీ కార్యదర్శి, మహిళ సంఘాల నుంచి ఇద్దరు, ఎస్సీ, బీసీ సభ్యులు ఉండేలా ఆదేశాలు ఇచ్చారు. కాగా, మున్సిపాలిటీలో కౌన్సిలర్, కార్పొరేటర్, చైర్మన్ ఉంటారని వెల్లడించారు. ఏడాదికి నాలుగున్నర లక్షల ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోగా… అందుకోసం పర్మినెంట్ స్టాఫ్ లేకపోవడంతో ప్రభుత్వంతో ప్రభుత్వం తాత్కాలిక ఇంజినీర్లను పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నది. దాంతోపాటు, అదే శాఖలో ఉన్న అధికారులు వివిధ డిపార్ట్మెంట్లకు డిప్యూటేషన్ విధానం మీద పని చేస్తున్న తెలంగాణ హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పర్మినెంట్ ఉద్యోగులు సొంత గూటికి వచ్చేయాలని ఆదేశాలు ఇచ్చింది సైతం ఇందుకేనని తెలిసింది.
ఈ మేరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర శాఖల్లో డిప్యుటేషన్ మీద పనిచేస్తున్న హౌసింగ్ కార్పొరేషన్ అధికారులను సొంత డిపార్ట్మెంట్ కు రిలీవ్ చేయాలని ఆదేశించారు. మొత్తం 242 మంది ఉద్యోగులు, అధికారులను రిలీవ్ చేయాలని అన్ని శాఖలకు లేఖ రాశారు. అయితే, ప్రస్తుతం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది కొరత ద్రుష్య్టా వీరందరినీ ఉపయోగించనున్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 78 మంది అధికారులు పని చేస్తుండగా… ప్రభుత్వ సంబంధిత పలు కార్పొరేషన్లలో 164 మంది సేవలు అందిస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు. అయితే, అత్యధికంగా జీహెచ్ ఎంసీలో 67 మంది పని చేస్తున్నారు. ప్రస్తుతం హౌసింగ్ శాఖలో సుమారు 647 మంది ఇంజినీర్లు వేర్వేరు విభాగాల్లో పని చేస్తుండగా… ఇంకా అవసరం ఉంటుందని శాఖ నుంచి ఒత్తిడి ఉన్నది. వీరందరితో పాటు ఇంకో 430 మంది ఇంజినీర్లు అవసరం ఉంటారని… వారందరినీ ప్రభుత్వం తాత్కాలికంగా తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రక్రియ అంతా ముగిసేందుకు ఇంకో రెండు వారాలు పడుతుందని తెలుస్తుంది.
ఫస్ట్ ఫేజ్ లో 4.5 లక్షలు… నియోజకవర్గంకు 35 వేల ఇండ్లు
ప్రభుత్వం ఈ సంవత్సరం సుమారు 4.5 లక్షల ఇండ్లు పేదలకు ఇచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నది. నియోజకవర్గానికి 35 వేల ఇండ్లు ఇవ్వాలని యోచన చేస్తున్నది. అందుకోసం ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్కారు ఇందిరిమ్మ కమిటీల ఏర్పాటుకి సంబంధించి ఇచ్చిన జీవోను అటు రెవెన్యూ అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు స్టడీ చేసి, తాజాగా జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రామం, వార్డు, మండలం, పట్టణం, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా స్థాయిలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు చేసి గతంలో ఎలా చేశారో… ప్రస్తుతం ఎలా చేయాలో అన్న అంశంపై వేగంగా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తున్నది.