'ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటిలో ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి'.. కాలేజీలకు ఉత్తర్వులు జారీ

by Vinod kumar |
ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటిలో ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి.. కాలేజీలకు ఉత్తర్వులు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటిలో ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మెడికల్ ఎడ్యుకేషన్​ డైరెక్టర్​ డాక్టర్​ రమేష్​ రెడ్డి సూచించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కాలేజీలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆవిర్భావ సెలబ్రేషన్స్‌లో భాగంగా జూన్​14న వైద్యారోశాఖ కు కేటాయించారని, సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్​చేయాలని డీఎంఈ కోరారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ని పేషెంట్లకు పండ్లు పంచడం, బెస్ట్ డాక్టర్లు, నర్సులు, స్టాఫ్‌ను గుర్తించి సన్మానించాలన్నారు. దీంతో పాటు అన్ని జిల్లాల్లోని ప్రోగ్రామ్​ ఆఫీసర్లు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, కేసీఆర్​కిట్, న్యూట్రిషన్​కిట్, సీఎంఆర్​ఎఫ్​స్టాఫ్‌తో ప్రత్యేకంగా మీటింగ్‌ను ఏర్పాటు చేయానల్నారు. మెడికల్ కాలేజీల్లో ని ఘనతను ఎక్కువ మందికి తెలిసేలా ప్రచారం చేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed