రాష్ట్రపతికి స్వాగతం పలికిన Governor Tamilisai

by GSrikanth |   ( Updated:2022-12-26 05:39:47.0  )
రాష్ట్రపతికి స్వాగతం పలికిన Governor Tamilisai
X

దిశ, వెబ్‌డెస్క్: శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఉదయం 10:40కి ఆమె శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలం బయలుదేరారు. ఇవాళ్టి నుంచి ఈనెల 30 వరకు సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నియలంలో ఆమె బస చేయనున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో బొల్లారం రాష్ట్రపతి నిలయంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి నిలయాన్ని శత్రు దుర్భేధ్యంగా తీర్చి దిద్దారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలోని 6 భవనాలు, వెలుపల ఉన్న 14 భవనాలను, చుట్టూ ఉన్న ప్రాంతాలను, ఉద్యాన వనాలను అందంగా తీర్చిదిద్దారు. తాగునీటి సదుపాయాన్ని మెరుగుపరచారు. అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు.

Also Read...

అనుకున్న పనిచేసిన సీఎం కేసీఆర్!

Advertisement

Next Story