కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి గవర్నర్ తమిళి సై ఫోన్.. ఆ విషయంపై ఆరా..!

by Satheesh |
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి గవర్నర్ తమిళి సై ఫోన్.. ఆ విషయంపై ఆరా..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గవర్నర్ తమిళి సై ఫోన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలనే డిమాండ్‌తో కిషన్ రెడ్డి ఇందిరా పార్క్ వద్ద 24 గంటల దీక్ష చేపట్టారు. కాగా, దీక్ష అనుమతి సమయం ముగియడంతో పోలీసులు కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కిషన్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, గవర్నర్ తమిళి సై ఫోన్ చేసి అరెస్టు వ్యవహారంపై ఆరా తీసినట్లు పార్టీ వర్గాలు స్పష్టంచేశాయి. అలాగే ఆరోగ్య పరిస్థితిపైనా ఆరా తీసినట్లు కమలనాథులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed