- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister's Tummala : నేత కార్మికుల ఉపాధికి ప్రభుత్వం చర్యలు : మంత్రి తుమ్మల ఆదేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో : నేత(Weavers) కార్మికుల ఉపాధి కల్పనకు, వారి సంక్షేమానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు( Tummala Nageshwar Rao) స్పష్టం చేశారు. సచివాలయంలో బుధవారం జౌళిశాఖపై రివ్యూ చేశారు. అన్ని ప్రభుత్వశాఖలు, కార్పోరేషన్ల నుంచి వారికి అవసరమైన వస్త్రాల కోసం వెంటనే ఆర్డర్లు తెప్పించుకోవాలని, టెస్కో నుంచి సంఘాల ద్వారా వస్త్రాల ఉత్పత్తికి తగిన చర్యలు తీసుకోవాలని టెస్కో ఎండీ శైలజా రామయ్యర్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలకు వస్త్రాల సప్లైని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే 96.03 లక్షల మీటర్ల వస్త్రాల ఉత్పత్తి కోసం సంఘాలకు ఆర్డర్ ఇచ్చామని, సంఘాల నుంచి కొనుగోలు చేసి సంబంధిత శాఖలకు సప్లై చేసినట్లు వెల్లడించారు. జీవో 18 ద్వారా వేములవాడ కేంద్రంగా రాజన్న సిరిసిల్లకి యార్న్ డిపో మంజూరీతో, 50 కోట్ల నిధులు మంజూరీ చేశామన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి
ధాన్యం సేకరణ, తరలింపు, నిల్వలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన తక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశించారు. సచివాలయంలో బుధవారం వేర్ హౌసింగ్ కార్పోరేషన్ ఇన్ఛార్జి ఎండీ ఉదయ్ కుమార్, ఆగ్రోస్ ఎండీ రాములు తో ధాన్యం కొనుగోళ్లపై చర్చించారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన సామగ్రిని అన్ని కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని, అవసరమైతే మరిన్ని క్లీనర్లు ఏర్పాటు చేయాలని, పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ రైతులకు కొనుగోళ్ళలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని గోదాముల నిల్వ సామర్థ్యం, ప్రాంతాల వారీగా అందుబాటులో ఉన్న గోదాముల నిల్వ సామర్ధ్యం, కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపునకు తీసుకోవల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. సివిల్ సప్లై అధికారులతో సమన్వయం చేసుకుంటూ వారికి వివరాలు అందచేస్తూ ధాన్యం తరలింపులో వారికి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం 29.537 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యం అందుబాటులో ఉందని, కొనుగోళ్లకు తగ్గట్లుగా నిల్వ సామర్ధ్యాన్ని అందుబాటులోకి తెచ్చేవిధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.