- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉమెన్స్ డే గిఫ్ట్.. మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. దేశంలోనే ఫస్ట్!

దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా మహిళలకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఉపాధి కల్పనలో భాగంగా (TGSRTC) ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి (RD.2) విభాగం ఈ ఉత్తర్వులు విడుదల చేసింది. మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 (RTC rental buses) ఆర్టీసీ అద్దె బస్సులు ఇవ్వనుంది. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రతి నెల ఒక్కో బస్సుకు రూ. 77, 220 అద్దె ఆర్టీసీ చెల్లించనుంది. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ ప్రభుత్వం ఇవ్వనుంది. దీంతో దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8 న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించనున్నట్లు అధికారుల సమాచారం.