- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గౌడన్నలను తాటిచెట్లపై చాలా సేపు నిలబెట్టారు: కేటీఆర్
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కల్లుగీత కార్మికుల రక్షణ కోసం కాటమయ్య రక్షణ కవచంను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో గీత కార్మికుల సమక్షంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తాటి చెట్లపై ఉన్న గౌడన్నలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి.. కిట్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.
గీత కార్మికులు తాటి చెట్టుపై నుంచి సీఎంతో మాట్లాడుతున్న వీడియో పోస్ట్ చేస్తూ.. మానవత్వం ఉన్న నాయకుడెవరూ ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడడని పేర్కొన్నారు. గౌడన్నలను ఆ చెట్ల మీద అంతంతసేపు నిలబెట్టి, వారి వృత్తి మీద చౌకబారు జోకులు వేస్తూ, దాన్ని ప్రచారానికి వాడుకోవడం అమానవీయం, దుర్మార్గమని విమర్శించారు. ‘మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే ప్రచారం పీక్‌లో ఉంటుంది అని మీ మతిలేని చర్యలు చూసి తెలంగాణ ప్రజలకు అర్థమవుతోంది’ అని ట్వీట్ చేశారు.