- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన: హోం మంత్రి మహమూద్ అలీ
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్రలో అపూర్వ స్పందన వస్తోందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. కేసీఆర్‌పాలన పట్ల ఆకర్షితులవుతున్న ఎంతోమంది మహారాష్ర్ట వాసులు పార్టీలోకి పెద్ద సంఖ్యలో చేరుతున్నారని చెప్పారు. మహారాష్ర్ట యవత్మల్జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు, సర్పంచులు, వార్డు సభ్యులు మంగళవారం బంజారాహిల్స్‌లోని హోం మంత్రి నివాసానికి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహారాష్ర్టవాసులు తెలంగాణా మోడల్అభివృద్ధిని కోరుకుంటున్నట్టు చెప్పారు. తమ సమస్యలను బీఆర్ఎస్ పరిష్కరించగలదని మహారాష్ర్ట ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. మహారాష్ర్ట ప్రజలతో ధృడమైన సంబంధాలు ఏర్పరుచుకోవటంలో పార్టీ సఫలం అవుతుందని చెప్పారు. పార్టీలో చేరిన మధుకర్అల్లూర్వర్మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్తదితర పథకాలు తమను ఎంతో ప్రభావితం చేశాయన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీలోచేరినట్టు చెప్పారు.