- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1276 పోస్టుల భర్తీకి..
దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ గురుకుల సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 1,276 పీజీటీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎల్లుండి నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ-రిక్రూట్ మెంట్ బోర్డు వెల్లడించింది.
మొత్తం 1,276 పోస్టులను భర్తీ చేయబోతుండగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్‌లో 343, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో 147, మహాత్మా జ్యోతి పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో 786 పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 1,276 పోస్టులలో 966 పోస్టులు మహిళలకు రిజర్వ్ చేయగా 310 పోస్టులు జనరల్ కోటాకు కల్పించారు.
ఆన్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 24 నుంచి మే 24 వరకు అవకాశం కల్పించారు. పరీక్షా తేదీ షెడ్యూల్ బోర్డు వెబ్ సైట్‌లో ఉంచుతామని హాల్ టికెట్లు డౌన్ లోడ్‌కు పరీక్ష తేదీ కంటే ఏడు రోజుల ముందు నుంచి అవకాశం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.