- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-2 పరీక్ష వాయిదా..!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలపై చర్చించేందుకు అభ్యర్ధులతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు.బేగంపేట టూరిజం ప్లాజాలో జరిగిన ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మురి వెంకట్, మానవతారాయ్, చరణ్ కౌశిక్, బాలలక్ష్మి, కిరణ్ యాదవ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు, నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగుల సమస్యలపై సుదీర్ఘ చర్చలు జరిగినట్లు తెలిసింది. నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లలో ఉన్న సమస్యలను కాంగ్రెస్ నాయకులకు వివరించారు. ఇందులో ముఖ్యంగా గ్రూప్-1 నోటిఫికేషన్ లో మార్పులు చేసి, మెయిన్స్ కోసం 1:100 నిష్పత్తిలో తీసుకోవాలని అభ్యర్ధులు కోరారు.
దీనిపై కాంగ్రెస్ నాయకులు వివరణ ఇస్తూ.. నోటిఫికేషన్లలో మార్పులు చేస్తే వివాదం చెలరేగి కేసుల పాలు కావాల్సి వస్తుందని, నోటిఫికేషన్లపై స్టే ఇస్తే.. కోర్టుల చుట్టూ తిరగడమే పనిగా పెట్టుకోవాల్సి వస్తుందని, గతంలో నిరుద్యోగుల ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని తెలిపినట్లు సమాచారం. ఇక గ్రూప్-2,3 పోస్టులను పెంచి, ఎగ్జామ్ ను వాయిదా వేయాలని కోరారు. దీనిపై నాయకులు గ్రూప్-2,3 పరీక్షలను వాయిదా వేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, గ్రూప్స్ పరీక్షలలో పోస్టులు పెంచి డిసెంబర్ లో పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని, దీనిపై 24 గంటల్లో నిరుద్యోగులు శుభవార్త వింటారని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే అభ్యర్ధుల వినతులను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళతామని నాయకులు హామీ ఇచ్చారు. కాగా గత కొద్ది రోజులుగా నిరుద్యోగుల సమస్యలపై అభ్యర్ధులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. నిరుద్యోగుల సమస్యలను కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకొని రావాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.