తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!.. 435 డాక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్

by Ramesh Goud |
తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!.. 435 డాక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డాక్టర్ల కొలువులను భర్తీ చేసేందుకు కార్యచరణ రూపోందించింది. దీని కోసం 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీని మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆద్వర్యంలో నిర్వహించనుంది. డాక్టర్ పోస్టుల భర్తీ కోసం జూలై 2 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనుండగా.. జూలై 11 తేదీని దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించింది. ఇందులో డీపీహెచ్ అండ్ ఎఫ్‌డబ్ల్యూడీఎంఈ విభాగంలో 431 పోస్టులు ఉండగా.. అందులో మల్టీ జోన్ 1 లో 270 పోస్టులు, మల్టీ జోన్ 2 లో 161 పోస్టులు ఉన్నాయి. ఇక ఐపీఎం విభాగంలో 4 పోస్టులు ఉండగా.. మల్టీ జోన్ 1 లో ఒక పోస్టు, మల్టీ జోన్ 2 లో 3 పోస్టులు ఉన్నాయి.

Advertisement

Next Story