టీచర్లకు గుడ్ న్యూస్.. బదిలీలపై సర్కారు కీలక నిర్ణయం

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-31 09:57:56.0  )
టీచర్లకు గుడ్ న్యూస్.. బదిలీలపై సర్కారు కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 2 నుంచి టీచర్ల బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ రేపు (శుక్రవారం) షెడ్యూల్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తొంది. టీచర్ల బదిలీలకు బుధవారం హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ బదిలీల్లో ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించనున్నట్లు తెలిసింది. కాగా, తుది తీర్పునకు లోబడే టీచర్ల బదిలీలు జరగాలని హైకోర్టు ఆదేశించింది. కాబట్టి హైకోర్టు ఆదేశానుసారమే టీచర్ల బదిలీల ప్రక్రియ జరగనుంది.

Advertisement

Next Story