TS : ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త!

by samatah |
TS  : ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఫలితా విడుదల దశకు చేరుకుంది. దీంతో అభ్యర్థులు ఎప్పుడెప్పుడు ఫలితాలు విడుదల అవుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో TSLPRB కీలక సమాచారం అందించింది. ఆగస్టు 3వ వారంలో ఎస్‌ఐ ఫలితాలను, సెప్టెంబర్ 2వ వారంలో కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. EWS రిజర్వేషన్ల కోసం పలవురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఫలితాల విడుదల మూడో వారానికి వాయిదా పడ్డట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వర్గాలు తెలిపాయి. కోర్టు అడిగిన ప్రశ్నలకు బోర్డ్ సమాధానం ఇచ్చిన వెంటనే, ఫలితాలు విడుదల కానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed