రైతులకు శుభవార్త: ఎరువుల ధరలు పెంచడంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం

by Anjali |   ( Updated:2023-05-17 14:30:04.0  )
రైతులకు శుభవార్త: ఎరువుల ధరలు పెంచడంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్ తెలిపింది. ఈ ఏడాది ఎరువుల ధరలు పెంచకూడదని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూ. 1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా యూరియాకు రూ. 70 వేల కోట్లు, డీఏపీకి రూ. 38 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించడమే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు పెరిగినప్పుడు వాటి భారం రైతుల మీద పడకుండా ఈ డేసిషన్ తీసుకున్నట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయా పేర్కొన్నారు. గత ఏడాది ఎరువుల రాయితీ కోసం కేంద్రం రూ. 2.56 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఈ సబ్సిడీ వల్ల దాదాపు 12 కోట్ల మంది రైతన్నలకు లబ్ధి చేకూరనుంది.

Also Read..

రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం.. మంత్రి మల్లారెడ్డి

Advertisement

Next Story

Most Viewed