- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Budget 2024-25: ఉద్యోగులు, వారి యజమానులకు గుడ్ న్యూస్.. బండి ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగులు, వారి యజమానులకు మోడీ సర్కార్ శుభవార్త చెప్పిందని కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. స్కీం ఏలో- ఈపీఎఫ్ఓలో మొదటిసారి రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులకు రూ.15,000 వరకు 3 వాయిదాల్లో ఒక నెల జీతాన్ని నేరుగా మొదటిసారి ఉద్యోగం సాధించిన వారికి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుందన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా 21 మిలియన్ల మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
స్కీం బీలో- ఉద్యోగంలో చేరిన మొదటి 4 ఏళ్లలో ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ ప్రకారం ఉద్యోగి, యజమాని ఇద్దరికీ నేరుగా ఇన్సెంటివ్ అందించబడతాయన్నారు. స్కీం సీలో- ప్రతి అదనపు ఉద్యోగికి వారి ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ కింద 2 ఏళ్ల పాటు నెలకు రూ.3000 వరకు యజమానులకు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం భద్రతా- యువత భవిష్యత్తు పదిలం అని వెల్లడించారు.