బండి, కావ్య మినహ మిగిలిన వారంతా కోటీశ్వరులే.. తేల్చేసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్..!

by Satheesh |
బండి, కావ్య మినహ మిగిలిన వారంతా కోటీశ్వరులే.. తేల్చేసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్..!
X

దిశ, సిటీ బ్యూరో: ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి విద్యావంతులే ఎక్కువ మంది ఎన్నికయ్యారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తేల్చింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు కాంగ్రేస్, బీజేపీ పార్టీల నుంచి ఎనిమిది మంది చొప్పున ఎంపిక కాగా, ఒక స్థానం నుంచి మజ్లీస్ పార్టీ గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. వీరిలో కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్, వరంగల్ నుంచి గెలిచిన కడియం కావ్య మినహా మిగిలిన ఎంపీలంతా కోటీశ్వరులేనని, వివిధ రకాలైన కేసులు కూడా వారిపైనే ఎక్కువగానే నమోదై ఉన్నట్లు గుడ్ గవర్నెన్స్ గుర్తించింది. ఈ సారి రాష్ట్రం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన 17 మంది ఎంపీల్లో ఇద్దరు ఇంటర్మీడియట్ చదివిన వారు కాగా, ఒకరు డిప్లొమా చేసిన వారున్నట్లు గుర్తించారు.

మిగిలిన 15 మందిలో ఎంఏ చదివిన వారు ఇద్దరుండగా, ఎంఏతో పాటు ఎంఈడీ చేసిన వారు ఒకరు కాగా, బీఎస్సీ చదివిన వారు ముగ్గురున్నట్లు గవర్నెన్స్ లెక్కలు తేల్చింది. వీరితో పాటు హోటల్ మేనేజ్ మెంట్‌లో డిగ్రీ చదివిన వారు ఒక్కరు కాగా, ఎల్ ఎల్ బీ చదివిన వారిద్దరున్నట్లు వివరించారు. ఎండీ (పాథాలోజి) చదివిన వారు ఒక్కరు కాగా, ఎంబీబీఎస్, ఎంఎస్ (జనరల్ సర్జన్) ఒక్కోక్కరుండగా, పీజీ డిప్లోమా చదివిన వారు కూడా ఒకరున్నట్లు గుడ్ గవర్నెన్స్ పేర్కొంది. వీరిలో పన్నెండు మంది ఎంపీగా గెలిచిన వారు పోలైన ఓట్లలో యాభై శాతానికి తక్కువగా ఓట్లు సాధించిన వారు కాగా, అయిదుగురు ఎంపీలు యాభై శాతానికి పై చిలుకు ఓట్లతో విజయం సాధించిన వారున్నట్లు గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది.

Advertisement

Next Story