- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిజికల్ డైరెక్టరేట్ ఉద్యోగాలకు రీ నోటీఫికేషన్ ఇవ్వండి!
దిశ, డైనమిక్ బ్యూరో: ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ ప్రక్రియ కోసం రీ నోటిఫికేషన్ జారీ చేసి సింగిల్ పీజీ చేసిన అభ్యర్థులకు న్యాయం చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్ పీఎస్సీ విడుదల చేసిన నోటీఫికేషన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం రెండు పీజులు చేసిన వారిని మాత్రమే అర్హులుగా పేర్కొన్నారని మండిపడ్డారు.
దీంతో సింగిల్ పీజీ చేసిన అభ్యర్థులు ఉద్యోగాలకు అనర్హులుగా మారారని, అసలు సింగిల్ పీజీ చేసిన అభ్యర్థులు ఎందుకు అర్హులు కాదో ఎలాంటి కారణాలు నోటిఫికేషన్ లో తెలుపలేదన్నారు. దీనిపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా ఒక్క పీజీ చేసిన వారికి సైతం అనుమతి ఇవ్వాలని, ఏ అభ్యర్థులైతే కోర్టును ఆశ్రయించారో వారికి మాత్రమే అర్హులుగా కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దీని వల్ల కోర్టును ఆశ్రయించని వేలాది మంది పేద నిరుద్యోగ యువత, సింగిల్ పీజీ చేసిన అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. అందువల్ల దీనిపై ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ న్యాయవాదిని ఏర్పాటు చేసి హైకోర్టు తీర్పు ప్రతి అభ్యర్థికి వర్తించేలా పోరాటం చేయాలని కోరారు. అర్హతలను మార్చివేస్తూ రీ నోటీఫికేషన్ ఇచ్చి అభ్యర్థులకు న్యాయం చేయాలని పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.