ఉరి వేసుకొని బాలిక ఆత్మహత్య

by GSrikanth |   ( Updated:2024-04-15 04:34:35.0  )
ఉరి వేసుకొని బాలిక ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకొని బాలిక ఆత్మహత్య చేసుకున్నది. జిల్లాలోని ఎడపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. బాలిక బోధన్‌లోని ఓ ప్రయివేట్ పాఠశాలలో చదువుతున్నట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story