- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ గవర్నర్‌గా గులాం నబీ ఆజాద్?
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్ భవిష్యత్ పై ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాల ఉహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన అనూహ్యంగా రాజీనామా చేయడం హస్తం శ్రేణులను అవాక్కయ్యేలా చేసింది. అయితే ఆజాద్‌పై గత కొంత కాలంగా బీజేపీ నజర్ వేసిందని.. బీజేపీతో ఉన్న ముందస్తు అవగాహన ప్రకారమే ఆయన అదును చూసి రాజీనామా చేశారనే ప్రచారం తెరపైకి రావడం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ను వీడి బయటకు వచ్చిన ఆజాద్‌కు కేంద్రంలోని బీజేపీ త్వరలో కీలక పదవి అప్పగించబోతుందనే ప్రచారం గుప్పుమంటోంది. త్వరలో జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన కసరత్తు షురూ చేసింది. ఈ క్రమంలో ఆజాద్‌ను ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిచడం లేదా మరో రాష్ట్రానికి గవర్నర్‌గా పంపించే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మైనార్టీ ఓట్లే లక్ష్యం..
రాజకీయాల్లో సుధీర్ఘ అనుభవం కలిగిన గులాం నబి ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారు. పార్టీలో ఎన్నో సమస్యల పరిష్కారంలో ఆయనది కీలక పాత్ర. అయితే గత కొంత కాలంగా పార్టీకి క్రమంగా దూరం అవుతూ వస్తున్న ఆజాద్ పట్ల గతంలో పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఆజాద్ డీసెంట్‌గా మాట్లాడుతారని, ఎప్పుడూ అనుచిత భాష మాట్లాడరని ఆయన నుంచి మనం ఇదే నేర్చుకోవాలని, ఆయనంటే తనకెంతో గౌరవమని చెప్పుకొచ్చారు. ప్రధానికి ఆజాద్ పట్ల ఉన్న ఈ సాఫ్ట్ కార్మర్‌నే కారణంగా చూపుతూ ఆయన త్వరలో బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం తెరపైకి తీసుకువస్తున్నారు. జరుగుతున్న ప్రచారం ప్రకారం గులాం నబీ ఆజాద్‌ను తెలంగాణ గవర్నర్‌గా పంపే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత గవర్నర్ తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే తెలంగాణలో బీజేపీ అధికారం కోసం గట్టి ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అపారమైన అనుభవం కలిగిన గులాం నబీ ఆజాద్‌కు తెలంగాణ గవర్నర్‌గా పంపడం ద్వారా మైనార్టీ ఓటర్లను సైతం ఆకర్షించే అవకాశాలపై బీజేపీ ఫోకస్ పెట్టిందనే చర్చ జరుగుతోంది.
సొంత పార్టీకే మొగ్గు?
ప్రస్తుతం జాతీయ మీడియాలో ఆజాద్‌కు సంబంధించి రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. బీజేపీతో అవగాహన ఒప్పందం ఎలా ఉన్నా ఆయన ఇతర పార్టీల్లో కలిసే ప్రసక్తిలేకపోవచ్చనే మరో చర్చ ప్రస్తావనకు వస్తోంది. జమ్ముకశ్మీర్ రాజకీయాల్లో మరింత యాక్టివ్ రోల్ పోషించేందుకు ఆయన సొంత పార్టీ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. రాజకీయంగా వివాదారహితుడిగా పేరున్న ఆజాద్‌కు దేశవ్యాప్తంగా మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాల ఆధారంగా సొంత పార్టీ ఏర్పాటు చేసి కశ్మీర్‌పై ఫోకస్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ ఎజెండాపై ఏమైనా ఆలోచించనున్నారా? అనే చర్చ కూడా మొదలైంది. ఇదిలా ఉంటే ఆజాద్ బాటలో మరి కొంత మంది కాంగ్రెస్ నేతలు పయనిస్తున్నారు. కశ్మీర్‌లో మరి కొంత మంది కాంగ్రెస్‌ను వీడినట్లు తెలుస్తోంది. మొత్తంగా గులాం నబి ఆజాద్ రాజీనామా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 'ఆజాద్ స్ట్రోక్' ఎలాంటి పరిణామాలకు దారి తీస్తోందో కాలమే నిర్ణయించనుంది.
ఇవి కూడ చదవండి : మరో ఐదుగురు జమ్ముకశ్మీర్ నేతలు హస్తానికి గుడ్ బై