Telangana: జిహెచ్ఎంసి సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపులు మొదలు

by Disha Web Desk 3 |
Telangana: జిహెచ్ఎంసి సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపులు మొదలు
X

దిశ సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 6 నుండి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు క్రీడా, నైపుణ్యాన్ని పెంపొందించేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంపులు గురువారం మొదలయ్యాయి . ఈ క్యాంపులను జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ చందానగర్‌లో ప్రారంభించారు. వచ్చే నెలాఖరు వరకు జరగనున్న ఈ సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంపుల్లో వివిధ క్రీడాంశాల్లో చిన్నారులకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా 44 క్రీడల్లో ప్రత్యేక సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. శిక్షణ శిబిరాలకు వచ్చే చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అలానే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో క్రీడ కారులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్, స్పోర్ట్ విభాగపు అధికారులు తదితరులు ఉన్నారు



Next Story

Most Viewed