వేసవిలో టీ తాగితేనే మంచిది.. అధ్యయనంలో తేలిన షాకింగ్ నిజాలు..?

by Disha Web Desk 7 |
వేసవిలో టీ తాగితేనే మంచిది.. అధ్యయనంలో తేలిన షాకింగ్ నిజాలు..?
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదు కావడంతో.. చెరువులు, కుంటలు కూడా ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. సూర్యుడి భగభగలకు వణికిపోతున్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది చల్లటి పానీయాలు తీసుకునేందుకే ఎక్కువ ముగ్గు చూపిస్తారు. అయితే.. కొంత మంది మాత్రం వేడి వేడి టీ తాగేందుకు ఇష్టపడతారు. ఈ క్రమంలోనే వేసవి కాలంలో అసలు టీ తాగొచ్చా లేదా అనే డౌట్ చాలా మందిలో ఏర్పడుతుంది. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. చల్లటి పదార్థాల కంటే వేడి పదార్థాలు బాడీకి మంచిదని తాజా అధ్యయనంలో తేలిందట.

వేసవిలో టీ తాగితే వేడి చేస్తుందని చాలా మంది.. టీ తాగడం తగ్గించేస్తారు. అంతే కాకుండా ఎక్కువ శాతం చల్లటి పదార్థాలు డ్రింక్స్, వాటర్, ఐస్ క్రీమ్ వంటివి తీసుకుంటారు. వీటి వల్ల బాడీ చల్లగా అవుతుందటి అపోహ పడతారు. కానీ నిజానికి చల్లటి పదార్థాలు బాడీ హీట్‌ను తగ్గించడం కాకుండా పెంచుతాయట. అయితే వేడి పదార్థాలు మాత్రం బయట వేడికి అనుగుణంగా బాడీ టెంపరేచర్‌ను కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తాయంటున్నారు నిపుణులు. చల్లటివి తీసుకోవడం వల్ల ఆ క్షణం బాగానే ఉన్నప్పటికి తర్వాత వాటి వల్ల బాడీలో వేడి పెరగడంతో పాటు.. కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. అయితే.. టీ తాగడం వల్ల బయట ఉన్న ఉష్ణోగ్రతలతో పోల్చితే శరీరం చల్లబడ్డట్లుగా ఫీల్ అవుతారట. వేసవిలో చల్లటి పదార్థాల కంటే వేడి పదార్థాలే శరీరాన్ని చల్లబురుస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే.. ఏదైనా మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచి చేస్తుంది.

నోట్: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది.

Next Story

Most Viewed