క్రికెట్ లవర్స్‌కు భారీ గుడ్‌న్యూస్.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై స్టార్ స్పోర్ట్స్ ప్రోమో రిలీజ్!

by Anjali |
క్రికెట్ లవర్స్‌కు భారీ గుడ్‌న్యూస్..  భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై స్టార్ స్పోర్ట్స్ ప్రోమో రిలీజ్!
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 టీ20 వరల్డ్ కప్ మరో మూడు వారాల్లో స్టార్ట్ అవ్వనుంది. క్రికెట్ లవర్స్ దృష్టి మొత్తం జూన్ 9 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. యావత్ ప్రపంతం భారత్ - పాకిస్తాన్ కోసమే చూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కు న్యూయార్క్ నసావు క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఇది వరల్డ్ కప్ టోర్నీలోనే హైలెట్ గా నిలుస్తుందనడంతో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా టీ 20 వరల్డ్ కప్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పై స్టార్ స్పోర్ట్ ప్రోమో విడుదల చేసింది. ‘వచ్చే నెల 9 న జరిగే దాయాదుల పోరుకు సిద్ధంగా ఉండండి’ అంటూ పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ మ్యాచ్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. క్రికెట్ లవర్స్ లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఇక వచ్చే నెల 2 నుంచి టీ 20 వరల్డ్ కప్ ప్రారంభం అవ్వనుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యమిస్తు్న్నాయి. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed