నడిరోడ్డు మీద అభయహస్తం దరఖాస్తులు.. ఇద్దరిని సస్పెండ్ చేసిన అధికారులు

by GSrikanth |   ( Updated:2024-01-09 09:19:46.0  )
నడిరోడ్డు మీద అభయహస్తం దరఖాస్తులు.. ఇద్దరిని సస్పెండ్ చేసిన అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: అభయహస్తం దరఖాస్తులను నిర్లక్ష్యంగా నడిరోడ్డుమీద పడేసిన ఘటనపై జీహెచ్‌ఎంసీ సీరియస్‌గా రియాక్ట్ అయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు హయత్‌నగర్, కుత్బుల్లాపూర్ టీమ్ లీడర్లను సస్పెండ్ చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కాంగ్రెస్‌ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వీకరించిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు రోడ్డుపై దర్శనమిచ్చిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ సర్కిల్‌కు చెందిన అప్లికేషన్లు బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై చిందరవందరగా కనిపించడంతో వాహనదారులు అవాక్కయ్యారు. కూకట్‌పల్లిలోని ప్రైవేట్‌ ఏజెన్సీతో కంప్యూటరీంచేందుకు వేలాది దరఖాస్తులను ర్యాపిడో స్కూటీపై అట్టపెట్టెలో తరలిస్తుండగా తాడు తెగి రోడ్డుపై పడిపోవడం చూసి ప్రజలు ఆందోళన చెందారు. పలువురు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అధికారులు స్పందించారు.

Read More..

ఇంజినీరింగ్ విద్యార్థుల చేతుల్లోకి ప్రజాపాలన దరఖాస్తులు

ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ ఎలా జరుగుతుందో తెలుసా? (వీడియో)

Advertisement

Next Story

Most Viewed