- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పాలన మీద దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ పై విమర్శలా: గెల్లు శ్రీనివాస్

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా బీఆర్ఎస్ పై రోజుకో ఆరోపణ చేస్తూ కాలం వెళ్లదీస్తుందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడులు చేస్తామని... మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఫామ్ హౌస్ ను ముట్టుకుంటే.. చూస్తూ ఊరుకోబోమన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలు కర్రు కాల్చి వాత పెడుతారన్నారు.
సీఎం కూడా లంకె బిందెలు ఉన్నాయని అనుకున్నామని గతంలో అన్నారని ఇప్పుడు ఖాళీ కుండలే ఉన్నాయని పేర్కొనడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం అన్నారు. పాలన మీద దృష్టి పెట్టకుండా.. బీఆర్ఎస్ పై విమర్శలా అని ప్రశ్నించారు. ఎన్నికల నాకు చూపించి.. హామీల అమలు ఎగవేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఇప్పటికే 50 రోజులు గడిచిందని, ఇంకా సగం రోజులే ఉన్నాయన్నారు. రాబోయే ఎన్నికలు ఏవైనా ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.