తెలంగాణ సచివాలయంలో గంగవ్వ సందడి.. వీడియో షేర్ చేసిన బీఆర్ఎస్ ఎంపీ

by Javid Pasha |
తెలంగాణ సచివాలయంలో గంగవ్వ సందడి.. వీడియో షేర్ చేసిన బీఆర్ఎస్ ఎంపీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సచివాలయంలో గంగవ్వ సందడి చేసింది. యూట్యూబర్, నటుడు అనిల్ గీలాతో కలిసి సెక్రటేరియట్‌ను సందర్శించింది. అలాగే ట్యాంక్‌బండ్‌పై కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా నిర్మించిన అమరవీరుల స్థూపంతో పాటు దేశంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని గంగవ్వ సందర్శించింది. సచివాలయం లోపలికి వెళ్లిన గంగవ్వ.. బిల్డింగ్‌ను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అలాగే అనిల్‌తో కలిసి చార్మినార్‌ దగ్గరకు కూడా గంగవ్వ వెళ్లింది.

చెవేళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి గంగవ్వ సచివాలయాన్ని సందర్శించిన వీడియోను తన ట్విట్టర్‌లో పంచుకున్నారు. 'ఏం అనిల్.. లోపలికి పంపివ్వరు అంటివి కదరా.. గంగవ్వ అంటే లోపలికి పంపించారు' అని ఈ వీడియోలో సచివాలయం లోపల గంగవ్వ మాట్లాడినట్లు ఉంది. ఎంపీ రంజిత్ రెడ్డి ఈ వీడియోను షేర్ చేస్తూ గంగవ్వ కూడా తెలంగాణ అభివృద్దిని నుంచి ఆశ్చర్యపోయిందని పేర్కొన్నారు.

'గంగవ్వ తెలంగాణకు చెందిన దిగ్గజ నటి.. తెలంగాణ మాండలికాన్ని, వేష భాషలను అందరి దృష్టిలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. ఆమెను పెద్ద తెరపై చూసినప్పుడు తెలంగాణ గ్రామాలలోని నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తాయి' అని రంజిత్ రెడ్డి ట్విట్టర్‌లో తెలిపారు. రంజిత్ రెడ్డి షేర్ చేయడంతో గంగవ్వ వీడియో నెట్టింగ్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం గంగవ్వ వెబ్ సిరీస్‌లతో పాటు పలు సినిమాల్లో కూడా నటిస్తూ తన భాషతో అందరినీ ఆకట్టుకుంటుంది. మై విలేష్ షో అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాపులర్ అయిన గంగవ్వ.. ఆ తర్వాత తెలుగు బిగ్ బాష్ షోలో కూడా పాల్గొంది.

Advertisement

Next Story

Most Viewed