Ganesh Visarjan : గణేష్ నిమజ్జనంలో చేయకూడని పని! జీహెచ్ఎంసీ కీలక విజ్ఞప్తి

by Ramesh N |   ( Updated:2024-09-16 08:44:13.0  )
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనంలో చేయకూడని పని! జీహెచ్ఎంసీ కీలక విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మూడు, ఐదు, 9 రోజుల పాటు గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రేపు చివరి రోజు కావడంతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. శోభాయమానంగా నగర రహదారులు మారాయి. జై బోలో గణేష్ నినాదాలతో రోడ్లన్నీ మార్మోగుతున్నాయి. కాగా, నిమజ్జనానికి ఊరేగింపుగా వచ్చే నిర్వహకులు ఒక పని చేయకూడదని జీహెచ్ఎంసీ కీలక విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది.

‘వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా మిషన్లతో గాల్లోకి రోడ్లపై కలర్ కాగితాలు ఎగరేయటం అప్పటికప్పుడు మీకు తాత్కాలికంగా వినోదంగా అనిపించవచ్చు. కానీ ఆ రోడ్లన్నీ శుభ్రపరచడానికి ఆ చెత్తను సేకరించటానికి జీహెచ్ఎంసీ సిబ్బందికి కొన్ని రోజులు సమయం పట్టి కష్టమవుతుంది. అలాగే ఆ చెత్త.. డ్రైనేజీ నీరు పోయే మార్గాల్లో ఇరుక్కుని రోడ్డుపై వరదలకు కారణం అవుతుంది. ఇలాంటి రంగుల కాగితాలు/ప్లాస్టిక్‌తో కూడుకున్న రిబ్బన్లు రోడ్లపై ఎగరేయద్దు’ అని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది.

Advertisement

Next Story

Most Viewed