రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన గద్దర్

by GSrikanth |   ( Updated:2023-07-02 12:55:40.0  )
రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన గద్దర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రజా యుద్దనౌక గద్దర్ ముద్దు పెట్టారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభా వేదికమీదకు వచ్చిన రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గద్దర్‌ను పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌తో మాట్లాడిన గద్దర్‌.. అప్యాయంగా హత్తుకొని ముద్దు పెట్టారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ భారీ బహిరంగ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. అడుగడుగునా పోలీసులు అడ్డుకున్న ఎవరి దారిలో వారు స్వంతంగా సభా స్థలికి చేరుకున్నారు.

Read More..

సభా ప్రాంగణానికి చేరుకున్న రాహుల్ గాంధీ

Advertisement

Next Story

Most Viewed