Ponguleti Srinivasa Reddy: గ్రీన్ చానెల్ ద్వారా నిధులు.. వారికి మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్

by Prasad Jukanti |
Ponguleti Srinivasa Reddy: గ్రీన్ చానెల్ ద్వారా నిధులు.. వారికి మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ములుగు జిల్లాలో మంత్రులతో కలిసి దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మేం గత పాలకుల మాదిరిగా ఫామ్ హౌస్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఉంచిన సుమారు 6-7 రూ.కోట్ల పెండింగ్ బిల్లులను కూడా మా ప్రభుత్వం చెల్లించిందన్నారు. రైతుల విషయంలో, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో మాకు ప్రాధాన్యత ఉందని చెప్పడానికి ఇవాళ దేవాదుల ప్రాజెక్టును సందర్శించడమే నిదర్శనం అన్నారు. ఈ ప్రాజెక్టును 2008లో వైఎస్సార్ హయాంలో శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత 15 ఏళ్లుగా నత్తనడకన నడుస్తున్నదన్నారు. 2026 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలన్నదే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేందుకు ఇంకా 3 వేల ఎకరాల భూ సేకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని, ఇంకా రూ.11.50 రూ. కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు.

ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం రైతులను రాజును చేసేందుకు వారికి అన్నిరకాల సహాయం చేసేందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులకుగ్రీన్ చానల్ ద్వారా నిధులు కేటాయిచబోతున్నామన్నారు. అలాంటి వాటిలో ఈ దేవాదుల ప్రాజెక్టు కూడా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన బిల్లుల చెల్లింపుల విషయంలో బేషజాలకు పోవడం లేదని వాటిలో జెన్యూన్ బిల్లులు ఉంటే వాటిని ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ విషయంలో ఛత్తీస్ గఢ్ తో సమస్య ఉందని ఈ సమస్యకు పరిష్కారం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ఇవాళ చత్తీస్ గఢ్ కు వెళ్లారన్నారు. ఈ సమస్యకు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణంలో శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, అంతకు ముందు ఇందిరమ్మ రాజ్యంలో కట్టిన ప్రాజెక్టుల ద్వారా గోదావరి నీటిని ఉమ్మడి వరంగల్ తో పాటు పాత నల్గొండ, పాత ఖమ్మంలోని కొంత ప్రాంతాలకు నీటిని ఇస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed