- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ-కాంగ్రెస్ MP టిక్కెట్లకు ఫుల్ డిమాండ్.. ఆ 4 స్థానాలకు ఊహించని రేంజ్‌లో అప్లికేషన్స్..!
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఎంపీ టిక్కెట్లకు పుల్ డిమాండ్ నెలకొన్నది. పదేళ్ల తర్వాత పార్టీ పవర్‌లోకి రావడంతో పార్లమెంట్ ఎన్నికల టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. శనివారం ఒక్క రోజే 166 దరఖాస్తులు రావడంతో ఇప్పటి వరకు 17 పార్లమెంట్ సెగ్మెంట్‌లకు 306 అప్లికేషన్లు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంటే ఒక్కో సెగ్మెంట్‌కు సగటున 18 మంది చొప్పున పోటీ పడుతున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, భువనగిరి, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజక వర్గాలకు అధికంగా దరఖాస్తులు రాగా, హైదరాబాద్‌కు అతి తక్కువగా వచ్చినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ లభించని నేతలతో పాటు, టీపీసీసీలోని స్పోక్స్ పర్సన్, ఇతర కీలక నాయకులంతా దరఖాస్తులు చేశారు. దీంతో పాటు చిత్ర పరిశ్రమ, ఆఫీసర్లు, వ్యాపారవేత్తలు కూడా ఈ సారి ఎంపీ టిక్కెట్ కోసం ఎక్కువ మంది అప్లై చేయడం గమనార్హం. ఫస్ట్ టైమ్ ఈ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. నాలుగు రోజుల పాటు గాంధీభవన్‌లో దరఖాస్తు ప్రాసెస్ జరిగింది.
పీఈసీ నుంచి సీఈసీ వరకు..
ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను ఫస్ట్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఫిల్టర్ చేయనున్నది. ఆ తర్వాత ఆ జాబితాను స్క్రీనింగ్ కమిటీకి అందజేయనున్నారు. అభ్యర్ధుల వివరాలు, పార్టీకి అందించిన సేవలు, గెలుపుపై సాధ్యసాధ్యాలపై స్క్రీనింగ్ కమిటీ వివిధ సర్వేల ఆధారంగా అధ్యయనం చేనున్నది. ఆ తర్వాత ఆ ఎంపిక చేసిన లిస్టును సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పరిశీలిస్తుంది. అక్కడ కూడా సింగల్ నేమ్ ఎంపిక చేసేందుకు హైకమాండ్ వివిధ సమీకరణాలు, సర్వేలు, పార్టీ మైలేజీని ప్రాధాన్యతలోకి తీసుకోనున్నది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు.
ఈజీగా గెలుస్తామనే..?
ఎక్కువ అప్లికేషన్లు వచ్చిన పార్లమెంట్ సెగ్మెంట్‌లలో సులువుగా గెలుస్తామనే అభిప్రాయంతోనే చాలా మంది దరఖాస్తు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్లమెంట్ సెగ్మెంట్‌లలో ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. దీంతో ఎంపీగా ఈజీగా విజయం పొందవచ్చనే నేపథ్యంతో చాలా మంది నేతలు ఆయా సెగ్మెంట్‌లకు పోటీ పడుతున్నారు. స్టేట్ నుంచి సెంట్రల్ వరకు మద్ధతు కూడకట్టుకొని టిక్కెట్లు పొందాలని లీడర్లు తాపత్రయం పడుతున్నారు. అయితే సీఈసీ ఎవరిని ఫైనల్ చేస్తుందనేది ఉత్కంఠగా మారింది.
ఇప్పటి వరకు అప్లై చేసిన ప్రముఖుల్లో కొందరు.. (కొన్ని సెగ్మెంట్ లలో పార్టీ వర్గాల సమాచారం ప్రకారం)
ఖమ్మం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, డాక్టర్ గడల శ్రీనివాసరావు, జెట్టి కుసుమ కుమార్, వ్యాపారవేత్త వంకాయలపాటి వీరయ్య చౌదరి కుమారుడు రాజేంద్ర ప్రసాద్, వీ హనుమంతరావు, రేణుకా చౌదరి
సికింద్రాబాద్: సామ రామ్మోహన్ రెడ్డి, అనిల్ యాదవ్, డాక్టర్ గడల శ్రీనివాస్, కోదండ రెడ్డి.
భువనగిరి: చామల కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, బండి సుధాకర్ గౌడ్
మల్కాజ్ గిరి: కపిలవాయి దిలీప్ కుమార్, సినీ నిర్మాత బండ్ల గణేష్,
నాగర్ కర్నూల్: మల్లు రవి, చారగొండ వెంకటేష్, మంద జగన్నాధం
నిజామాబాద్: ఆకుల లలిత
మహబూబాబాద్: భట్టు రమేష్, బానోత్ విజయాబాయి, బెల్లయ్య నాయక్, బలరామ్ నాయక్
ఆదిలాబాద్: రాథోడ్ ప్రకాష్
వరంగల్: మోత్కుపల్లి నర్సింహులు, పిడమర్తి రవి
కరీంనగర్: రమ్యారావు
నల్గొండ: పటేల్ రమేశ్ రెడ్డి, కందుకూరి రఘువీర్ రెడ్డి
మెదక్: జగ్గారెడ్డి, బండారు శ్రీకాంత్ రావు